ఎటు పోతున్నాం మనం?
ఎటు పోతున్నాం మనం?
1 min
290
అదో యుద్దం
ఒకర్ని ముగ్గురు, నలుగురు
కలిసి చిదగ్గొడుతుంటే
చుట్టూ ఉన్నోళ్లు
పొందుతున్న పైశాచిక ఆనందం
వీడియోలో చూస్తుంటే
అసహ్యం వేస్తోంది.
భయమూ వస్తోంది.
ఈ వికృతక్రీడా సంసృతి
ఎన్నెన్ని వెర్రి పోకడలు పోయి
మానవ జాతి
మానవత్వాన్ని మరిచిపోయేలా
పసి మనసుల మీద
విషపు జల్లు కురిపిస్తోంది
ఎక్కడ హింస జరిగినా
మూలాలు ....మెదళ్లల్లో....
మళ్ళీ బుద్ధుడు ,గాంధీలు
పుట్టా లేమో...
ప్రపంచం లో శాంతి స్థాపించాలంటే.
రేపటి తరం ప్రశాంతంగా బ్రతికేందుకు.
-------౦౦౦౦౦౦౦౦౦౦౦------