ఎన్నో రాత్రులు కొన్నే పగళ్లు
ఎన్నో రాత్రులు కొన్నే పగళ్లు


ఇష్టమా కోపమా
శరీరపు రసాయనిక చర్యల ఫలితమా
వయసెందుకు గురుతుండదు
మనసెందుకు గమ్మునుండదు
అతని ఛాతీ అంత ఆకర్షణ ఎందుకు
ఆమె పెదాలపైన మెరుపు వస్తుంది ఎందుకు
కన్ను కొట్టడంలో ధైర్యం ఎందుకు
పెదవి కొరకడంలో తొందర ఎందుకు
తేరిపార చూడడంలో అనుభవం ఎందుకు
శృంగార ఆరాధనలో మోక్షం ఎందుకు
గాజుల గలగలలో సముద్రపు అలలు ఎందుకు
కోరికల తాపాలు ఎందుకు
అతని కౌగిలి ఆమె లోగిలిగా మారి
ప్రకృతీ పురుషుల సంగమంగా వారి కలయిక చేరి
ఎవరి శ్వాస ఎవరిదో గుర్తుపట్టలేనట్లు మారడానికి అడ్డంకులు ఎందుకు
వారి కలయిక కోసం
ఎన్నో రాత్రులు కొన్నే పగళ్లు సరిపోతాయనా..