ఏముంది నవ్వడానికి
ఏముంది నవ్వడానికి
ఏముంది నవ్వడానికి ఇక్కడ
ఏముంది నవ్వడానికి ఇక్కడ...?
వికట వెకిలి నవ్వుల వ్యంగ వికటట్టాహస
పరిహాస అల్పానంద నవ్వులోన
ఈర్ష్య ద్వేశ కుళ్ళు కుట్ర మలిన
మురికి కరుకు మనసుల నడుమ
ఏముంది నవ్వడానికి ఇక్కడ..?
స్వార్థ లాభార్జన వ్యక్తివ వ్యక్తుల నడుమ
దొంగ నా..లపుట్స్ లపాంగిలా నడుమ
స్వచ్ఛత లేని నవ్వుల నడుమ
ఆత్మశుద్ధి గాంచని సత్య ప్రమాణాలలోన
ఏముంది నవ్వడానికి ఇక్కడ..?
నాటక జగతిలోనా కపట వేషాల నడుమ
రీతి లేని రోతలోనా కంపుకొట్టె రొచ్చులోనా
బంధాల ఉచ్చులోనా అనుబంధాలు
విసిరే చిక్కుల వలలలోనా....
ఏముంది నవ్వడానికి ఇక్కడ..?
చేరతీయలేని ఆత్మీయల నడుమ
అల్పానందమయ అర్థ అసంతృప్తి నవ్వులోన
ఏముంది నవ్వడానికి ఇక్కడ..?
ఏముంది నవ్వడానికి ఇక్కడ..?
