ఏదో ఏదో అనాలని..
ఏదో ఏదో అనాలని..
ఎవర్నంటాను నిన్ను తప్ప
అని నా నోరు నొక్కేసి
నీ ఇష్టా రాజ్యంగా మాట్లాడావు
బానే ఉంది
మనవాళ్ళే కదా అంది అని
నేను ప్రేమ చూపించాను
చూసే వాళ్ళకది పైత్యం కదా
ఒకరు తిడుతున్నా
మొహం మీదే నువ్వు నాకొద్దు అంటున్నా
దేబిరించుకుని మళ్ళీ వాళ్ళ గుమ్మం తొక్కితే
దాన్ని ప్రేమని ఎవరంటారు
ఏమీ అనకుండా ఎందుకుంటారు
ఏదేమైనా నువ్వు చేసింది తప్పే
అయినా అదేమైనా నాసా ప్రయోగాల రహస్యమా
మూడో ప్రపంచ యుద్ధ ప్రణాళికా
ఏదో అల్లరిగానో
చనువుతోనో
నేనో మాట చెప్పానే అనుకో
దానికే అంత ఇదవ్వాలా
ఆ స్కైలాబ్ ఏదో నావల్లే పడింది అన్నట్లు
యుగాంతం నాతోనే వస్తుంది అన్నట్టు
నన్ను దూరం పెట్టాలా
అయినా నాకు మొదట్నుంచీ నువ్వంటే చిరాకు
నచ్చేస్తావ్ అని తెలిసే నేను దూరంగా
నీ డొక్కు లాజిక్ లు నాకొద్దు
నేనిలా అర్థం పర్థం లేని రాతలు రాస్తూ
ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నా
సరేనా
