STORYMIRROR

Dinakar Reddy

Action Thriller

4  

Dinakar Reddy

Action Thriller

ఎద్దుతో పోటీ

ఎద్దుతో పోటీ

1 min
321

మేలు జాతి వృషభమే

చూడగానే మెచ్చుకోలు

రంగు రంగుల వస్త్రం కట్టి

తీరుగా అలంకరణ చేసి

మైదానంలో వదిలారు


పోట్ల గిత్తకు పోటీగా

పరుగెత్తే వాడు ఎవడని వెతగ్గా

బరిలోకి దిగాడు ఒకడు

రాతి పనిముట్లతో చెక్కినట్లున్న దేహంతో

గట్టిగా శ్వాస విడిచి

కాలు దువ్వాడు


ఎద్దు గిట్టలు మట్టిని కదిలించి

దుమ్మును రేగ్గొట్టగా

అతను ముందుకు కదిలాడు

ఒక్క కొమ్ము దెబ్బకు

అతడి ఛాతీ పైన రక్తం చిమ్మింది


ఆది నుంచీ అదుపు చేస్తున్న భావన

అతడిలోని ఆదిమానవుడిని రెచ్చగొట్టి

ముందుకు ఉరికేలా చేసింది

తెగింపుతో ఒడుపుగా పట్టి 

ఎద్దును అధిరోహించి

కొమ్ములు పట్టుకుని సవారీ చేసాడు


ప్రేక్షకుల్లో స్పందన

పందెం రాయుళ్ల జోరు

అతని ప్రియురాలు నిస్సహాయంగా కూర్చుంది

జంతువులా మారిన మనిషిని చూసా

అతనిలో పోరాడే శక్తిని చూసా

లేక ఆ జంతువుల క్రీడ అతణ్ణి

ఏదో రోజు బలి కోరుతుందనా

ఎవరికి తెలుస్తుంది..


Rate this content
Log in

Similar telugu poem from Action