STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

దురలవాట్లు

దురలవాట్లు

1 min
0

దురలవాట్లు.

(తేటగీతి మాలిక )


ధూమపానంపు మత్తులో దొరలి దొరలి

పోవు చుందురీ యువకులు మూఢ మతిని

శ్వాస కోశము నాశమై చావు వచ్చు

మరచి పోదురీ నిజమును మందమతులు.


తగని ప్రేమను జూపుచు తల్లి దండ్రి

కనక మొసగుచు బిడ్డలన్ గాంచరకట!

పిచ్చి యలవాట్లు మరగిన పిల్లలిపుడు

పెద్దలన్ దూల నాడుచు పెరుగు చుంద్రు.


కాన్సరను జబ్బు వచ్చునీ కాలమందు

కాల మెప్పుడు మన వెంట కలిసిరాదు

వెఱ్ఱి పోకడల్ జూపుచు వీధులందు

తిరుగు చుందురీ హీనులు తెలివి లేక.


ఆయువంతయు తరుగంగ నాశవీడి 

కుములు చుందురు చివరకు క్రుంగి క్రుంగి

ముందు జాగ్రత్త పడుకున్న ముప్పు వచ్చు

మాను కొన్నచో మిగులును మంచి బ్రతుకు.


మంచి యలవాట్లతో ప్రజ మసలు చుండ

బలము తెలివియు కల్గిన భావితరము

జాతి మనుగడ నిల్పుచు సాగుచుండ

ప్రగతి బాటలో దేశము పరుగులిడును.//


Rate this content
Log in

Similar telugu poem from Inspirational