దీపావళి - ఆనందహేళ : వచన కవితా సౌరభం
దీపావళి - ఆనందహేళ : వచన కవితా సౌరభం
దీపావళి - ఆనందహేళ : వచన కవితా సౌరభం - కవీశ్వర్ (prompt -26)
ఈ దీపాలవరుసల పండుగ - దివ్వెల వెలుగుల పండుగ
ఒకనాటి సంప్రదాయ వైభవం - ఆచరణలో ఇప్పుడు లుప్తం
రకరకాల టపాకాయలు - భరించలేని ఆర్ధిక కారణాలు
ఉపయోగించే వీలుండీ - దుష్ప్రభావాి ల పరిస్థితి
పర్యావరణ రక్షణ వల్ల - సంబరం చేసుకోలేని దుస్థితి
అనారోగ్య కారణాలచే - కాలుష్య ప్రభావం పైచేయి
గతించిన వైభవాన్ని - గుర్తుకు తెచ్చుకుని కాలం గడిపేయి
భావితరాలకు మనం ఇచ్చే సంప్రదాయం - కాల ప్రభావం వల్ల పంచలేని పరిస్థితి
వ్యాఖ్య : " ఒక్క దీపావలె కాదు అన్ని పండుగల పరిస్థితి కూడా ఇలాగే సరిగ్గా ,
సంప్రదాయ పద్ధతి తో జరుపుకొనడం ఇలాగే కాల ప్రభావం, పరిస్థితుల ప్రభావం చే
భావితరాలవారికి సవ్యంగా అందిచడం ఈ కాలంలో గగనకుసుమమైపోతుంది."
కవీశ్వర్
