దిగంతాలదాకా
దిగంతాలదాకా
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఓ విప్లవం
రాకెట్ వేగంతో ముందుకెళ్తూనే ఉంది
దిగంతాల దాకా విస్తరించింది గాలిలా
సముద్రం నుంచి దొడ్డుప్పు రవ్వలా
మనం అందుకున్న విజ్ఞానం
అంతా తెలుసన్న అహం నోరు తెరిపిస్తుంది
ఊళ్లో ఉన్నప్పుడు డబ్బు తక్కువే
ఆత్మీయతలు, ప్రేమలు, అనుబంధాలు
పచ్చని చెట్టులా విస్తరించేవి
కులాలు, మతాలు కొనగోటితో సమానం నాడు
పట్టణాలపై పల్లెల ప్రభావం పతా లేకుండా పోయింది
పట్టణాల నాగరికత విస్తరించింది పల్లెల్లో
క్రమంగా కోల్పోతున
్నాం మానవ సంబంధాలు
మనుషుల మధ్య ప్రధానమైంది వ్యాపారీకరణ
ఎంత అరిచిగీపెట్టినా గడప దాటడం లేదు శబ్దాలు
దిగంతాల దాకా చాటి చెప్పాలన్న ఆలోచన
మనసు లోపల గునుక్కుంటోంది
సాహిత్య రచన చేస్తుంటాం
అందరికీ నచ్చాలనుకుంటాం
తీపి మిఠాయి లానైనా, చేదు మాత్ర లానైనా
మంచి చేయాలన్న ఆలోచన
లోకానికి కొరుకుడు పడుతుందో లేదో చెప్పలేం
రాస్తూనే ఉంటాం, రాస్తూనే ఉండాలి
కొందరికైనా నచ్చుతుంది ఆరోగ్యవంతంగా
దిగంతాల దాకా చేరాలన్న కోరిక
మానుకుంటే మంచిదేమో, మానుకోలేం