దేశం
దేశం


రుధిరధారలతో రగిలిన
భరతభూమి
అశ్రుధారలతో మరిగిన
రణభూమి
దేహంపై కాక
దేశంపై వాత్సల్యం
పెరిగిన జవాను
కర్తవ్యమే ఊపిరియై
కార్యసాధనే ధ్యేయమై
జనన మరణములు
సహజాతిసహజాలని
జాతీయ జండాయే
జవాను లక్ష్యమని
జయభేరి మ్రోగించి
నిరూపించి నిలచిన
వీర సైనికుడా
జోహార్ జోహార్
మీ త్యాగం ధైర్యం
నిరుపమానం
మీ జ్ఞాపకం
మా గుండెల్లో
పదిలం పవిత్రం