డబ్బు చూపే రుచులు
డబ్బు చూపే రుచులు
బిర్యానీ ఘుమఘుమలు
హిమ క్రీములతో కూడిన స్వీట్లు
వేలాడే జీవాల తోళ్ళ మార్కెట్లు
తెల్లగా అవడానికి ఒక క్రీము
ఆ తెలుపు నిలబడడానికి ఒక క్రీము
ఆ క్రీము వాడినట్లు దాచేందుకు మరో క్రీము
తక్కువ జనం
ఎక్కువ స్థలం
భూమీ ఆకాశం ఏకమయ్యే తీరం
ఏసీ గాలుల తీవ్రత
ఏ కాలం ఏదో తెలీదుగా
పొగడ్తల పన్నీరు జల్లులు
ఏడాది పొడవునా కురియగా
డబ్బు ఎన్నో రుచుల్ని చూపిస్తుంది
నీకు మాత్రమే
నువ్వు మాత్రమే
నీవొక్కడవే అన్నీ అని అనిపించేలా చేస్తుంది
కానీ
జీవితం
అందరికీ ఇచ్చినట్లుగానే
చివరికి మట్టి వాసనను బహుమతి ఇస్తుంది
ఓడానో గెలిచానో చెప్పలేని డబ్బు
ఇంకో పెట్టెలోకి చేరిపోతుంది..
