COVID -19 : నర్సుల సేవలు
COVID -19 : నర్సుల సేవలు
ఆసుపత్రులు పట్టనంత రోగులు
చాలీ చాలని మందులు, బెడ్లు
యెటు చూసినా నిరాశ వలయం
COVID-19వ్యాక్సిన్ ఆశల చట్రం
వేడి పుట్టించే ppe కిట్స్ ధరించి
పేషంట్స్ ను గమనిస్తూ
వారికి అవసరమైన మందులు ఇస్తూ
పగలూ రాత్రీ
చావు కేకల శబ్దాలు వింటూ
మృత్యువు విహారాన్ని భరిస్తూ
విషాదం దాచి
చిరునవ్వుతో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ
మానవత్వం ఉనికిగా
ఆసుపత్రి కారిడార్లో నిలబడి
ధైర్యంగా సేవ చేశారు నర్సులు
ఒక్కొరిదీ ఒక్కో కథ
కరోనా కాలపు వ్యథ
