STORYMIRROR

ARJUNAIAH NARRA

Tragedy Fantasy

4  

ARJUNAIAH NARRA

Tragedy Fantasy

చిరునవ్వుల పరదా

చిరునవ్వుల పరదా

1 min
465

చిరునవ్వు పరదా కప్పి

నిజాన్ని దాస్తున్నవా ప్రియా!

పరదా వెనుక ఉన్న పరదేసి

ప్రియుడి అన్వేషణని నీవు ఆపగలవ?

తన కళ్ళు నీ రూపం కోసం తపిస్తున్నాయి

తన కాళ్ళు రహదారులను దాడి చేస్తున్నాయి

తన మనసు నీకై తపిస్తున్నది


బహుశా నీకు తెలుసా!

చిరునవ్వుతో పరదా కప్పి 

నిజాన్ని దాస్తున్నావు కాని

నీ కళ్ళు తననే వెతుకుతున్నాయి

నీ కాళ్ళు తన వైపే సాగలంటున్నాయి

నీ మనసేమో తననే పరితపిస్తుంది


నీ చిరునవ్వు పరదా దాయలేదు అందుకే

అతని కాళ్ళు నా వాకిట్లో సంచరించాయి

అతని చూపులో నీ చూపులు కలిసాయి

అతని మనసుతో నీ మనసు

చిరునవ్వుతో గుసగుసలు పోసాగాయి

ఏమని తెలుసా ప్రియా!

ఊరిని కాలిచేశావు కానీ 

నీ మనసును నా మనసు వదలలేదు

రా ప్రియా ఆ ఊరును ఆ ఇల్లును ఆ మనిషిని

అతని మనసును కాలిచేసి రా......


Rate this content
Log in

Similar telugu poem from Tragedy