STORYMIRROR

T. s.

Abstract Tragedy

4  

T. s.

Abstract Tragedy

చీకటి శబ్దం

చీకటి శబ్దం

1 min
244

నిశ్శబ్దశబ్దం వింటూ చీకటిలో కనులు తెరిచి దేని కోసమో వెతుకుతూ ఉంటాను..

చీకటి గుహలో దారి తెలియని బాటసారిలా సాగిపోతుంది నా బ్రతుకు ప్రయాణం..

ఒక్కసారిగా నా రంగుల ప్రపంచం వెలిసి వెతల చీకటిగా మారిపోయింది..

ఏ భావం లేని మనసులో నిశ్శబ్దం స్దబ్దుగా కూర్చుంది..

భావశబ్దమే లేనట్టు మనసు మూగగా మొద్దుబారిపోయింది..

నలుపు చీకటిలో సంతోషాల సంబరాల వెలుగులు కానరావట్లేదని మనసు కనులను కాగడాగా చేసుకుని కాంతి రేఖల కోసం కాచి చూస్తూ ఉంటాను..

కలువపూల వెలుతురు కోసం కాపు కాస్తూ ఉంటాను..

చిక్కటి చీకటిలో చిక్కుకుని.. నిశ్శబ్దశబ్దంలో..

చీకటి శబ్దాన్ని వింటూ ఉంటాను.. దేని కోసమో వెతుకుతూ ఉంటాను.


Rate this content
Log in

Similar telugu poem from Abstract