చేయి చేయి కలుపుదాం!
చేయి చేయి కలుపుదాం!
చేయి చేయి కలుపుదాం,
అన్నిటినీ సాధిద్దాం,
పర్యావరణాన్ని పరిశుభ్రంగా మార్చుకుందాం,
ప్రతి ఒక్కరు మొక్కలను నాటుదాం,
వాటిని సంరక్షించుకుందాం,
చెట్లను నరకడం ఆపుదాం ,
ప్రభుత్వం తీసుకోవాలి కఠిన నిర్ణయం,
భారతదేశాన్ని పచ్చగా మారుద్దాం,
ప్రపంచాన్నే చేసేద్దాం హరిత వనం,
జంతువులకు కాస్త ఆహారాన్ని మిగిలిద్దాం,
వాటికిి ఎండాకాలంలో కాస్త నీరు ఏర్పాటు చేద్దాం,
పేదలకు కాస్త సహాయం చేద్దాం,
వారికిిి నిత్యావసర సరుకులు అందిద్దాం,
మనకు ఉండాలి పాటించే దృఢ సంకల్పం,
అందరిలో నింపాలి జన జాగృతి నవ చైతన్యం,
చేయి చేయి కలుపుదాం,
అన్నిటిని సాధిద్దాం.