బ్రతుకులు...
బ్రతుకులు...
మనసంటూ ఉందేమో
బాధలు భరించడానికి
అదే లేకుంటే బాధించే
అంశం ఉండదేమో
చిన్ని గుండెకు
ఎందుకయ్యా
ఇన్ని చిత్రాలు ఇచ్చావు
మనస్సు చింతను
ముఖం పైన చూపించలేక
తల్లడిల్లిపోతుంది మనస్సు
మనస్సును కట్టడి చేసి
పెదవులకు రంగుల పువ్వులను
పూయించడం ఎంత కష్టమో
నీకేమి తెలుసు
అందులో మా మనుషులతో
మా మనుషులకు పోటీలు
ఎక్కువాయే సాటివారితో
ఎక్కడ మా డిగ్నిటీ తగ్గుతుందో
అనే భయం వకవైపు
మా తాతలు నేతులు తాగారు
మా మూతులు వాసన చూడండి
అనే సామెత ఊరికే చెప్పలేదు
మనలాంటి వారం ఉన్నాం కాబట్టే
ఉన్నంత లో ఉండటమే ఉత్తమం
అని తెలుసుకోలేక పరుగులు
తీస్తున్నాము సతికిలా పడుతూ... బ్రతుకులు
