బ్రతుకు
బ్రతుకు
విషాన్ని చిమ్మే..పలుకులు దేనికి..!?
చెలిమిని నిలుపని..కులములు దేనికి..!?
జన్మల చెత్తను..కాల్చగ తలచరె..
మనసున ఇంకా..ముసుగులు దేనికి..!?
చూడరు శ్వాసను..మునుగరు లోపల..
జ్ఞానము ఇవ్వని..మతములు దేనికి..!?
జీవుల చంపుకు..తింటే నరులా..
రాక్షసులే కద..తపములు దేనికి..!?
కోర్కెలు తీర్చే..దైవా లెవరో..
పూజలు సల్పగ..పూవులు దేనికి..!?
సత్యము తెలిసీ..అయోమయములా..
ఆచరించనీ..బ్రతుకులు దేనికి..!?
