బంధం - ఓ ఆనందం
బంధం - ఓ ఆనందం
పూల పొదరిల్లు లాంటి చక్కని ఇల్లు
లతల వలే అల్లుకున్న బంధాలు
ప్రతిక్షణం చిరునవ్వుల సందళ్ళు
ఎటు చూసినా ఆనందపు ఆనవాళ్లు
బాధ అనే పదానికి చోటివ్వని ఆత్మీయ భావాలు
ఒంటరితనాన్ని తరిమికొట్టే అపురూపమైన పలకరింపులు
స్వర్గాన్ని తలపించే అనురాగ జల్లులు
ఇది కావా అసలైన జీవనపు విలువలు
