భూగోళపు బాంబుగుండు
భూగోళపు బాంబుగుండు


భూగోళపు బాంబుగుండు
----------------------------------------
ఖండాలే ఎల్లలుగా
ప్రపంచక్షేత్రమె లక్ష్యంగా
పోటీ పడుతూ గెలుస్తూ
విజయపతాకలు ఎగరేయాలని
ఆశిస్తూ తపిస్తూ
వ్యవస్థలన్నీ వస్తున్నాయ్
కానీ............
వాతావరణకాలుష్యాల్తో
స్వయంకృతాపరాధాల్తో
పాంచభౌతికప్రకృతిలో
సమతుల్యత్వం లోపిస్తూ
వికృతమానవకృత్యాల్తో
సహజపటుత్వంక్షీణిస్తూ
విద్య వైద్యంవిజ్ఞానం ఆర్థికం
అన్నీ కలిసిన మహావ్యవస్థ
మానవసమాజజీవన వ్యవస్థ.................
క్రమంక్రమంగా కుళ్ళుతూ..
ప్రళయావస్థలో వణికేస్తోంది!
పతనావస్థలో బ్రతుకు నీడుస్తోంది!!
ఇది భూగోళం మేడిపండు!
పగలబోతున్న విషబాంబుగుండు!
ఎగరవలసినవి జెండాలుకాదు!
తెరవవలసినవి విచక్షణానేత్రాలు!
పెరుగవలసినవి పరస్పరపోటీలుకాదు!
జరుగవలసినవి నష్టనివారణాచర్యలు!!