STORYMIRROR

Sai Chandrasekhar Gudladona

Abstract

4  

Sai Chandrasekhar Gudladona

Abstract

*భిన్న కోణాలు*

*భిన్న కోణాలు*

1 min
422

విషయం తొలుస్తూనే వుంటుంది

వినయానికి తావులేని చోట

విభేదం తప్పనిసరై ఊరియూరి

ఉబికిన వేదనను క్రోధం చేస్తూ


నిలువునా దహించడమే

మాట అగ్గిపూలు చల్లుతున్నపుడు

కాలుతున్న కణికల మధ్య మనసులో

ఒక్కో భావన ఒక్కో వైపుకు ఆక్రమిస్తుంది


పురుగు వేరును తొలుస్తుంటే

బిక్షకు పడి గాపులు పడి తినే క్రిములకు

వేరు విలువ చెప్పినా అర్థమవని స్థితి

కాలం చెప్పే నీతి గొరీపై మొక్క


తలలో పుట్టిన భావాలు తలగడగా పెట్టి

నియంతృత్వ పోకడ నీడ అక్కున చేరితే

ములుగర్ర పెట్టి నెట్టినా కదలని

సమభావ స్ఫూర్తి బూడిదలో పన్నీరే


మారుతున్న పంథా జారుడు బండ లాగై 

దాడి చేసే గతుకుల్లో కాసేపు నిలిచి

తలపోసిన వేళన తాళలేని ఉద్దీపన

మరో మార్పుకు కోణమౌతుంది


ఈ రణగొణ ధ్వనుల మధ్య ఆ

జీవితానికి కొట్టిన గంట చివరి గంటే


   *గుడ్లదొన సాయి చంద్రశేఖర్* 

              *హైదరాబాద్* 

             *9866966001*


Rate this content
Log in

Similar telugu poem from Abstract