STORYMIRROR

Sai Chandrasekhar Gudladona

Abstract

4  

Sai Chandrasekhar Gudladona

Abstract

ఊహించని వరం

ఊహించని వరం

1 min
385

అన్నీ...

విశ్వాన్ని వీక్షిస్తాయి

జీవన శైలిని ఆస్వాదిస్తాయి

రస డోలికల పులకిస్తాయి

యవనికల చాటుగా పరికిస్తాయి


అన్నీ...

సమన్వయ గొలుసుల బందీలే

సుఖ సాగర తీరాన సేదతీరే బిందువులే

ఘోషా కెరటాల అలజడికి ఆనవాళ్లే 

బుద్భుధ ప్రాయ ప్రాణ ప్రమాణాలే


అన్నీ...

కాల సర్ప కాటు బాధితులే

ప్రకృతిలో జనించిన తరంగ రేణువులే

నిశీధి నిశ్శబ్దాలే

విస్ఫోటనా సహిత మహా శబ్దాలే


అన్నీ...

అరమరికల ఛాయలు పూసుకున్నా

అంతరాంతర శక్తి సమ్మోహనాలే

ఒడిదుడుకుల చీకటి ముసురుకుంటున్నా

ఓరిమి కూరిమి దారి దీపాలే


పూర్ణాహుతి తప్పని ఈ సమిధల మధ్యన

ఉద్భవించిన సంతులో నా వంతు ఒక వింతే...

ప్రజ్ఞ వలయమై ఆవరించి

హరించని జ్ఞాన మొలకలెత్తించి

ఉతృష్ట జన్మ భిక్ష వేసిందేవరో...


నిజమే...

నాకిది ఊహించని ఒక వరమే...


                         గుడ్లదొన సాయి చంద్రశేఖర్

                                    హైదరాబాద్

                                 9866966001


ఈ రచన నా స్వంతం...మరే కవితకు కాపీ కాదని హమీ ఇస్తున్నాను


                        గుడ్లదొన సాయి చంద్రశేఖర్ 


Rate this content
Log in

Similar telugu poem from Abstract