STORYMIRROR

Sai Chandrasekhar Gudladona

Abstract

4  

Sai Chandrasekhar Gudladona

Abstract

ఒంటరి పయనం

ఒంటరి పయనం

1 min
221

మనసు వైపు చూసుకో బంధమా

పెనవేసిన నులితాడు

చివరి పోగుతో వేలాడుతూ

తెగేందుకు చూపుతున్న తహ తహ


అన్నీ తెలుసు 

జీవితం క్షణ భంగురమని బుద్భుద ప్రాయమని

తలకు దట్టించిన నీతి శతకాలకు

నిప్పంటిచుకుంటున్నదెవరో


బుసలు కొట్టే పడగలు

విషపు నీడలే

కంఠాన్ని బిగిస్తున్నా

వాటి జాడనే


ప్రకృతిలో అన్ని కాలాలూ

ఒక మాదిరి ఎలా మరి

సహనం గుండెకు తట్టని

మరుగుజ్జుతనం ఒంటికి పట్టిందే


శతాధిక మార్లు సహాయపడిన నేస్తాన్ని

ఒకటో రెండో మార్లు దొర్లిన తప్పుల

అనేకమార్లు మననం చేసి 

బంధాలను ఖననం చేసేస్తున్నావేం 


పర్యవసానపు జీవన యాత్రన

మిగిలేది నీవొక్కడివే

చివరికి నిను మోసే

ఆ నలుగురూ కరువే


   *గుడ్లదొన సాయి చంద్రశేఖర్*

              *హైదరాబాద్* 

             *9866966001*


Rate this content
Log in

Similar telugu poem from Abstract