STORYMIRROR

Sai Chandrasekhar Gudladona

Inspirational

4  

Sai Chandrasekhar Gudladona

Inspirational

ఎదురుచూపు

ఎదురుచూపు

1 min
305

అదొక మనో విలయం

దాటనివ్వదు పెదాల వలయం

గుంభనంగా గుండెన

విస్ఫోటనం ముందు అగ్ని కీలలా


వ్యక్తిత్వ సామర్థ్యం

నిర్ణయించేది నడిచే కాలం

తప్పని అనువుగాని చోట

ఊరే అవమానపు ఊట


కాలికి గుచ్చుకున్న ముల్లుకు

బిగించిన విల్లులా పెదవులు

సంధించిన భావ వ్యక్తీకరణా శరాల్ని

వెనక్కి ఎవరో లాగుతున్నట్టే


తరచి చూస్తే గతించిన రోజుల కమురు

కట్టలు దాటని కన్నీటి చమురుతో

నుసి పట్టిన ప్రమిదలా

చాన్నాళ్లే మిణుకు మిణుకు మంటోంది


గాలి తాకుతుందా

బరువెక్కి ముసిరిన మబ్బుకు

జడివాన కురిసే తెంపును

తలపున వంపని జీవన శైలి


కంఠం దాటని ఆ గరళం

కావాలంటోంది సంఘం కోసం సరళం

తేలికగా తేల్చి పంజరాన్ని విడిచిన పిట్టలా 

తేలికపడాలంటోంది మనసు...


   *గుడ్లదొన సాయి చంద్రశేఖర్*

              *హైదరాబాద్* 

             *9866966001*


Rate this content
Log in

Similar telugu poem from Inspirational