Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sai Chandra Sekhar Gudladona

Abstract

4  

Sai Chandra Sekhar Gudladona

Abstract

శోధన

శోధన

1 min
250


మనసు ముద్దవుతుంది

ఆ భావావేశ జడివానకి

సేద తీరుస్తుంది గొడుగు పట్టి 

తెల్లని కాగితాలపై అక్షర ముత్యాలై


ఆవేశపు ఆ రాతలు

మారుస్తున్నయట జీవిత గీతలు

ఆ జ్ఞానం బ్రహ్మ నుదుట పెట్టిన

భావ ప్రకటనా తిలకమే


పరికించిన ప్రతీ కోణం

ప్రపంచం ప్రణమిల్లడానికా

వ్యక్తిత్వం ప్రేరేపించడానికా

ఉబికిన ఉడుకును చల్లార్చడానికా


ఆ కళ్ళలో అమాయకత్వం అంతా ఇంతా

కళ్ళ వెనుక దాగిన ఆకలి 

మెదడుకు మేతలా 

భావుకత దాహం తీరుస్తుంటుంది బతుకంతా


దిగంతాల అంచులు చూపుతూ

స్పందించే గుణ సామర్థ్యం

చుక్కలతో చక్కర్లు కొట్టే

వెన్నెల దారుల ప్రయాణం

నన్నో నిరంతర సంచారిని చేస్తుంది


   *గుడ్లదొన సాయి చంద్రశేఖర్*

              *హైదరాబాద్* 

             *9866966001*


Rate this content
Log in

Similar telugu poem from Abstract