STORYMIRROR

Sai Chandrasekhar Gudladona

Romance

4  

Sai Chandrasekhar Gudladona

Romance

ఆగమన వేళ

ఆగమన వేళ

1 min
374

జడత్వం జడలు కట్టి

గుబులు మోస్తున్న మనసు... 

చీకటి వాకిట నిలచిన కలువకు

వెన్నెల రేఖలా నీ ఆగమనం...


తలపుల మలుపులలో నిలబడి 

నువు చేసే అలజడి రోజూ అపూర్వమే

కనుమూయనీయదు నీ రూపం

నిలువనీయదు నువు తలపుకు రాని ఘడియ 


చెలిమికి చిరునామా నీవైనపుడు

చెరగని చిత్రమై రంగులీనుతుంది

ఆద్దిన రంగులలో పొంగిన తళుకు నేననిపిస్తుంది 

ఈ ప్రాణ దీపపు కాంతికి హేతువు మరి నీవేగా


ఆశల వేదికలా ఊగిసలాడే మదికి

కోరిక లంగరు గుండెకు వేసి దోబూచులాడే ఆటన బుట్ట బొమ్మనే నేను

తాళం వేస్తూ కదిలించే జోరున నీవు


ఈ తలపులు చేరే తీరంలో

యుగమైనా క్షణమే

ఆ తరంగాలలో అంతరంగాలు

మమేకమైన కాలం అపురూపమే 


   *గుడ్లదొన సాయి చంద్రశేఖర్*

              *హైదరాబాద్* 

             *9866966001*


Rate this content
Log in

Similar telugu poem from Romance