STORYMIRROR

Sai Chandrasekhar Gudladona

Abstract

4  

Sai Chandrasekhar Gudladona

Abstract

నీ జత కోసం

నీ జత కోసం

1 min
417

ఆ కళ్ళలో ఏం దాచావు

అంతగా ఆకర్షిస్తున్నాయి

దూరంగా అనిపిస్తావు

దగ్గరగా కవ్విస్తావు


నువు పిలిచినట్టనిపిస్తుంది 

ఉలికిపడుతుంది నా హృదయం

నాలో ఏదో తెలియని తనం

క్షణక్షణం గుర్తు చేస్తావు


నాకనిపిస్తుంది

నీ సంగమంలో పూర్ణత్వం

పుష్కలమని

చెప్పే ధైర్యానికేదో సంకెల


గుండెనిండా తీసిన శ్వాస

నీ నామం రోజూ పలుకుతుంది

అంత అర్ధం కానట్టేంటి ఆ ముఖం

భావం వెతుక్కోవాల్సివస్తుంది 


పువ్వులన్నీ ఏరాను ఈ ప్రకృతిన

నీ పాదాలపై దోసిలితో అర్పిద్దామని

తడబడిన అడుగుల తప్పు మరచి

అందివ్వవా స్వామీ నా ఆరాధనకు ఆలంబన


   *గుడ్లదొన సాయి చంద్రశేఖర్*

              *హైదరాబాద్* 

             *9866966001*


Rate this content
Log in

Similar telugu poem from Abstract