STORYMIRROR

Sai Chandrasekhar Gudladona

Inspirational

4  

Sai Chandrasekhar Gudladona

Inspirational

త్యాగ ఫలం

త్యాగ ఫలం

1 min
227

చిందిన నెత్తుటి మరకలు కడిగి

స్వతంత్రం ఎర్ర కార్పెట్ పరిచిన క్షణం 

త్యాగాల భుజాలనెక్కి ఎగరేసిన మువ్వన్నెల జండా

ఎర్ర కోటపై రెపరెప లాడిన 

తరుణం


పరుల భోజ్యమైన దేశంలో

మేథస్సున పురివిప్పిన రాజ్యాంగం 

కదం తొక్కిన కలం కురిపించిన

నిబద్దతాక్షర సమాజ దర్పణం


ఈ మట్టి వాసన గట్టిదేనని

విశ్వ వేదిక పై చాటుతున్నది నేటికీ మన యువతరం

తెలియజేస్తుంది ఎంత సులభమో తలెత్తి బ్రతకడం 


నా గాలిని నే శ్వాసిస్తూ

నా ఉనికికి ఊపిరి పోస్తూ 

నన్ను నేనుగా లోకానికి పరిచయం చేస్తున్న 

స్వతంత్ర భారతమా...జై హింద్ 


 గుడ్లదొన సాయి చంద్రశేఖర్

హైదరాబాద్ 

9866966001


Rate this content
Log in

Similar telugu poem from Inspirational