STORYMIRROR

Sai Chandrasekhar Gudladona

Others

4  

Sai Chandrasekhar Gudladona

Others

గజల్: వాన బతుకు

గజల్: వాన బతుకు

1 min
384

4-4-4-4


బతుకులు వడలెను కురిసిన వానతొ

గతుకులు మిగిలెను వెలిసిన వానతొ


తప్పని తకరా కాలపు కథలకు

విడువని వెతలిక తడిపిన వానతొ


పంటలు పండిన చినుకులు సరియే

చేనులు మునిగెను చెరిపిన వానతొ


చిత్రపు పోకడ తెలియును నేతకు

దోపిడి దారులు తెరిచెను వానతొ


జీవిత నడకలు కూలెను విపణిన

రాతలు మారెను జడిపిన వానతొ


   *గుడ్లదొన సాయి చంద్రశేఖర్*

              *హైదరాబాద్*


Rate this content
Log in