STORYMIRROR

Sai Chandrasekhar Gudladona

Romance

4  

Sai Chandrasekhar Gudladona

Romance

ఎద గీత

ఎద గీత

1 min
416

నీపై నడిచే ఊహల సిరా

మనసు నిండి ఊరుతూనే

పాళీ ఖాళీ కాదు

దస్తాలు దస్త్రాలై నిండుతూనే


తూలిన రెప్పలు

ఎద రెక్కలు విప్పారుస్తాయి

నిను జత చేసి 

మనో ఆకసాన బడలికలేని వ్యాహ్యళికు నాంది 


నేల జాబిలిలా నీవు కురిసే వెన్నెల 

మనసుకు స్నానమై మెరుపులీనుతూ

నువు దరిగా కదిలి చల్లిన పరిమళం

మధువు గ్రోలిన మధుపంలా మదిని ఉడికిస్తూ 

మూగ భాషకు పదాలు నేర్పిస్తాయి


ముగ్ధ మోహన యవ్వన నీడన

కలాలు కళలద్దితే

తీరికలేని భావ పరంపర

పూల శరాలై గుండెన పందిరేసి

నిను దేవతగా అక్షరాన ప్రతిష్టిస్తాయి


   *గుడ్లదొన సాయి చంద్రశేఖర్*

              *హైదరాబాద్* 

             *9866966001*


Rate this content
Log in

Similar telugu poem from Romance