STORYMIRROR

VENKATALAKSHMI N

Tragedy Inspirational Others

3  

VENKATALAKSHMI N

Tragedy Inspirational Others

అత్యాశ

అత్యాశ

1 min
213


నిజం నేస్తం,.

నిర్జీవమని తలచిన

నాదైన ప్రపంచానికి

ప్రాణం పోసింది నీ నవ్వు..


నల్ల మబ్బులకు మాత్రమే

అలవాటు పడిన

కాటుక దిద్దిన కనులు

కొత్త రంగులు చూస్తున్నాయి


సాగర ఘోష మాత్రమే

ఎరిగిన మనసు

సమీరాల ఆస్వాదనకు

అలవాటు పడింది


నీ రాకకై నీ చూపు కై

కొన్ని కోట్ల విరహవేదనను

సైతం అవలీలగా

మోయగలుగుతుంది


అంతరంగ చప్పుళ్ళు తప్ప

ఆనంద రాగాలు వినని

ఈ అంతరంగం

వీణలు మీటడం నేర్చింది


నీ పరిష్వంగనకై పరితపించే

నా అత్యాశ ను కూడా!

నీ సున్నిత మనసుతో

మాయ చేసి అద్భుతం లా

నిలబడతావు


నన్ను నా మనసును

దోచిన ఆ చిరునవ్వు కు

దాసోహమై నీ వాడిగా

నీ పాదదాసుడిగా

నిలచిపోనా..


Rate this content
Log in

Similar telugu poem from Tragedy