అతడికి హత్య సహజమే..
అతడికి హత్య సహజమే..
అతను మళ్లీ కనిపించాడు
క్లాసులో అల్లరి కుర్రాడు
అమ్మాయిల గుండెల్లో మన్మథుడు
ప్రేమ కబుర్లలో నేర్పరి
ఎవ్వరైనా మెచ్చే తుంటరి
ఒక్కటే చిత్రం
అతడు నిన్నటిని హత్య చేశాడు
అవును
నిన్నటిని
నిన్నటి బాసల చెలిని
ఆ చెలి కంటి కన్నీటిని
ఆ కన్నీరు తడిపిన చెంపను
అన్నిటినీ హత్య చేశాడు
శరీరం మిగిల్చి మాటలతో తూట్లు పొడిచి
ఆమెకు జీవితంపైన విరక్తి కలిగించాడు
అలాంటి ' ఆమె ' లు ఎందరో
అతడికి నిన్న అవసరం లేదు
నిన్నటిి రోజును హత్య చేయగలిగిన అతను
నా పూర్వ విద్యార్థి
ఇప్పుడు గతం తాలూకు జ్ఞాపకాల్ని లిఖిస్తూ
అదే జీవితం అనుకుంటూ బతికేస్తున్నాడు
