STORYMIRROR

ARJUNAIAH NARRA

Inspirational

4  

ARJUNAIAH NARRA

Inspirational

అస్పృస్యులరక్షకుడు

అస్పృస్యులరక్షకుడు

1 min
537

రత్నగిరి జిల్లా.......

భిమాభాయి రాంజీలకు

చివరి సంతానంగా పుట్టిన

భీం రావుని కుటుంబానికే కాకా

జాతికే రత్నంగా, మణిపూసగా 

తీర్చిదిద్దిన తండ్రి రాంజీకి వందనాలు


బైకుల్లా మార్కెట్......

పగలంతా మాములు బజారు

పదిహేను సంవత్సరాల వరుడికి

తొమ్మిది సంవత్సరాల వధువుకి

చిన్న చిన్న అరుగులే పెద్దలకు ఆసనాలుగా

రాత్రంతా వివాహ వేడుకలకు ముస్తాబైయింది

అంబెడ్కర్, రమభాయి పెళ్లికి వేదికగా నిలిచింది

తెల్లారింది మళ్ళీ బజారులో సంత నడిచింది


మా అంబెడ్కర్....

పంచములు, అంత్యజులు, ఆవర్ణులు,

అతి శూద్రులు, హరిజనులు అంటరాని కూలల

హితుడుగా, తాత్వికుడుగా, మార్గదర్శిగా, 

అణచబడ్డ జాతుల ఆశజ్యోతిగా

అణగారిన ప్రజల గుండెల్లో అమరుడు 


మనువు .......

రాతలతో అస్పృస్యులగా మారిస్తే

మా అంబెడ్కర్....తన రాతలతో మా కర్మ రాతలను మార్చిన మరో సృష్టికర్త....

మా రక్షకుడు...మా దేవుడు....

మా అంబెడ్కర్.......



Rate this content
Log in

Similar telugu poem from Inspirational