STORYMIRROR

VENKATALAKSHMI N

Tragedy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Tragedy Inspirational Others

అపర భగీరథులు

అపర భగీరథులు

1 min
254

కల్లోలం సృష్టిస్తున్నకరోనా

అలజడులతో నానా హైరానా

భయంతో భీతిల్లిన ప్రజల ఆర్తనాదాలను

ఆలకించే ఆప్తుడెవరు?

ప్రాణభయంతో వేగం పెరుగుతున్న

గుండె చప్పుళ్ళను వినే

దేవుడెవరు?

తెల్లకోటు వేసుకుని

ప్రశాంత వదనంతో

తమ ప్రాణాలను లెక్క చేయక

ఉద్యోగ ధర్మమే బాధ్యతగా

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా

మీ కోసం మేమున్నామంటూ

ముందు వరుసలో

నిలిచారు కరోనా వైద్యులు

నిర్విరామంగా నిరంతరంగా

కంటి మీద కునుకు లేకుండా

తన మన బీద బిక్కి చూడక

స్వార్థం మరచి హితమే ఎంచి

సమర సైనికుల్లా కదిలారు

కరోనా పోరులో నిలిచారు

ధృఢసంకల్ప దీక్షతో

దివిసీమలో నిలిచిన దేవుళ్ళు

పరోపకారమే పరమావధిగా

సాగుతున్న భగీరథులు

ఇలలో సరిలేరు

మీకెవ్వరు

సాటిరారు ఇంకెవ్వరు


Rate this content
Log in

Similar telugu poem from Tragedy