అంశం:చిత్రకవిత vyaakhyalu
అంశం:చిత్రకవిత vyaakhyalu
అంశం:చిత్రకవిత
పై చిత్రానికి 5 చిత్రవ్యాఖ్యలు వ్రాయండి
చిత్రవ్యాఖ్య రెండు పాదాలు ఉండాలి
రెండు పాదాల చివరిని అంత్యప్రాస తప్పని సరి
ఉదా//
రాళ్ళతో కడవను నింపింది
పాపం!దాహంతీరక కాకి చచ్చింది
1 . పంచ భూతాత్మిక మృణ్మయ పాత్రలు
కాలం తీరగానే చెల్లును నిక్కంసవిత్రులు
2 . సృష్టించ బడెను మా"నవ" బ్రహ్మచే
పంచేంద్రియములు ఆగెను కర్మచే
౩ . చిన్నపాటి కోరికలు తీరినచో అలసితివి
పెద్ద కోరికలు ఎప్పుడు తీరునో అని వేచితివి
4 . కడవ కడవకు ఎంతో కొంత నిండుదనము
తడవ తడవకీ జీవికి అంతే వెలితి(దనము
5 . కష్టపడి చేసిన పనికి ఫలితము ఇదేనా?
సౌఖ్యము పొందుట ఇలలో గగనమేనా?
రచన : జయంత్ కుమార్ కవీశ్వర్ . 17. 05. 2022 .
