STORYMIRROR

ARJUNAIAH NARRA

Abstract Inspirational

4  

ARJUNAIAH NARRA

Abstract Inspirational

అంబెడ్కర్

అంబెడ్కర్

1 min
651

కడు పేదవాడిగా పుట్టి

కడపటి కులంలో పెరిగి

కడకు పెద్దవాడిగా ఎదిగి

గడప గడపకు తుదకు

ప్రజసౌమ్యనికే ఆయువయ్యావు


బడి బయట కూర్చొని

ఆరుగుకు ఆవల నిల్చొని

బావి కాడ భయపడుతూ

బాజారులల్లో బహిష్కరించబడుతూ

బ్రిటిష్ ప్రతినిధులతో భేటీ అయ్యే ఎత్తుకెదిగినావు


అగ్రకుల అహంకారానికి అంకుశమైనావు

అనాదలకు మొక్కయినావు

పేదలకు దిక్కాయినావు

బడుగుల బతుకుల్లో మెతుకైనావు

తుదకు భారతా రాజ్యాంగ ప్రదాతవైనావు


పంచమ జాతిలో పుట్టిన

అంటరాడివని శపించిన

నయవంచనాలను ఛేదించి

అంచనాలను మించి

ప్రపంచమే నిన్ను మెచ్చి

నీ పుట్టిన రోజును 

ప్రపంచ విజ్ఞాన దినమని దీవించే


దేశమందు కొంత మంది నేతలు పుట్టి

పరదేశీయులకు సలాము కొట్టి

భారతీయుల నెత్తిమీద మట్టిని కొట్టి

కోటు సూటు వేసుకుని కోట్లకు పడగలేత్తి

బానిస సంకెళ్లను మరింత బంధించాలని చూస్తే

అణగారిన గొంతై మానవ హక్కులకై నినదించావు


పీడిత నిమ్నజాతి కులాలకు

అసలు స్వేచ్ఛ, స్వాతంత్య్రం అంటే

నేలమీద నడవటం, నీరుని త్రాగడం,

గాలిని పీల్చడం, పుడమి నందు పుట్టిన 

ప్రతి ప్రాణి హాక్కు అని చెక్కి తుదకు 

అసలు సిసలైన భారతీయుడవని  

బ్రిటీషర్లు మరియు గాంధీనే గౌరవించే



Rate this content
Log in

Similar telugu poem from Abstract