STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

4  

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

అమ్మ

అమ్మ

1 min
269


అమ్మా!

నీ ఊపిరే నా ఆయువు

నీ చిరునవ్వే నా ప్రపంచం

నీ చల్లని ఒడి నా తొలి బడి

నా గుండె సవ్వడి నీవు

నా మది కోవెలలో దైవం నీవు

సరిహద్దులెరుగని సహనం నీవు

మాతృప్రేమకు కొలువు నీవు

ప్రేమకు ప్రతిరూపం నీవు

వాత్సల్యానికి చిరునామా నీవు

మమతలకు మూలం నీవు

బంధాలకు భాష్యం నీవు

ఆనందాలకు ప్రాకారం నీవు

కరుణకు సాకారం నీవు

త్యాగాలకు నెలవు నీవు

ఆదరణకు అర్థం నీవు

నీ దీవెనెలే నాకు

తరగని సిరులు

నీ ఆశీర్వచనాలే

నాకు శ్రీరామరక్ష


Rate this content
Log in

Similar telugu poem from Abstract