అక్టోబర్ 15th
అక్టోబర్ 15th
మిస్సైల్ ( అబ్దుల్ కలామ్ జన్మ దినం సందర్భంగా) Oct 15 th
నేల నుండి నింగికి ఎగిసిన...
మిస్సైల్...అబ్దుల్ కలామ్!
పేపర్ బాయ్ అయినా...
శ్రమిస్తే..పేపర్ పై ఉంటాడని!
మంచివాడు మదిస్తే...
మహా పురుషుడు అవుతాడని!
పేదవాడైనా...పట్టుదలతో శ్రమిస్తే
ప్రెసిడెంట్ అవుతాడని!
వీటన్నింటికీ...
కావల్సింది.. డబ్బు కాదు!
చదువు...
తపన..
లక్ష్యం..
మంచి ఆశయం..
అని..
తెలియజేసిన... ఓ కలామ్!
నీవొక...శుద్ధ జలం!
నీ దృఢ చిత్తమే...నీకు బలం!
నీ వాక్కు....అనర్గళం!
విశ్వమంతా...వ్యాపించింది నీ గళం!
నీ తెలివి.......అచంచలం!
నీ యుక్తి కి సరిపోదు...యే బలం!
నీ ఘనతను చాటంగ చాలదు యే.. కలం!
నీ వల్ల ఈ దేశం ఎక్కింది...అందలం!
నీ వంటి దేశ భక్తుడి ని ఇంక... తేలేం!
అందుకే...
కలామ్..అందుకో!
మా అందరి..... సలాం!
......రాజ్......
