అక్షర విలాసం
అక్షర విలాసం
అక్షరాలను పదాలుగా మార్చి
పదాలను వాక్యాలుగా మార్చి
వాక్యాలను సరైన క్రమంలో పేరాలుగా మార్చి
పుస్తకాలను రూపొందించే కవులు రచయితలు
కనుమరుగౌతూ ఉంటే అక్షరం విలపిస్తుంది
అక్షరాల అల్లికలు
పదాల అమరికలు
వాక్యాల వంపుసొంపులు
పదనిసలు సరిగమలు
గతి తప్పి మతి పోయి మూల్గుతూ ఉంటే అక్షరం విలపిస్తుంది
వర్ణనలలో వదుగలేక
సంపదలో సరిలేక
గమనంలో గమ్యం లేక కనుమరుగౌతూ
కాటికి చేరిన సమయంలో
చచ్చి బ్రతికి అక్షరాలు విలాపంతో జీవిస్తున్నవి
ఈ నవ సమాజ శ్రేయస్సును కోరి....!!!!
