STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

అదృష్టం తలుపు తట్టింది

అదృష్టం తలుపు తట్టింది

1 min
353

ఘడియ ఘడియకూ తలుపు చప్పుడు

తలపుల్లో నీ రూపే ఎప్పుడూ

రారే లతల్ సరాగముల్ నా ఇంటికి

నీ రాకతో అదృష్టం తలుపు తట్టింది


నువ్వు చెప్పిన అంకెలతో లాటరీ తగిలింది

ఆ తర్వాత డబ్బు తగులుతూనే ఉంది

క్లబ్బుల్లో రేసు పందేల్లో

రియల్ ఎస్టేట్లో

డబ్బు తగులుతోంది


కానీ ఒక ప్రశ్న మిగిలిపోతోంది

ఈ డబ్బు ఆశకు అంతం ఎక్కడ

అదృష్టం సంగతి సరే

ఆ అదృష్టం నా నుంచి ఏం లాగేస్కుంది అని


వినడానికి విచిత్రమే

కానీ ఇది నిజం 

వేల సార్లు అనుకున్నా 

నానుంచి దూరమైన నన్ను తెలుసుకోవాలని

డబ్బులు లెక్కపెట్టుకుంటూ కాలం గడిచిపోయింది

ఇక అదృష్టం వంతు..


Rate this content
Log in

Similar telugu poem from Abstract