అదేం ఆనందం
అదేం ఆనందం
కలిసి ఉండాలని
విడిపోవడం
అదే అదే
ఎవరో కలిసి ఉండాలని
నువ్వూ నేనూ విడిపోవడం
ఆకులు రాల్చేస్తుందని చెట్టు శిశిరాన్ని రావొద్దంటుందా
శిశిరం తరువాత వసంతం రాక మానదని ఎదురుచూడదూ
అలానే స్నేహంలో గొడవలూనూ
అసలు స్నేహమంటే ఏమిటి
ఏమిటో అంటావా
ఏమైతే నాకెందుకు అంటావా
నాకు సంబంధం లేదు అంటావా
మళ్లీ అదే ప్రశ్న
చిరాగ్గా
పరాగ్గా
జుట్టు ఊడేలాంటి కలవరం
విడిపోవడానికే అయితే
అసలెందుకు కలవడం
ఈ మాత్రం దానికి
స్నేహం పేరు వాడడం
