STORYMIRROR

MohanKrishna Landa

Inspirational

4  

MohanKrishna Landa

Inspirational

అద్భుతం ఒక అబద్ధం

అద్భుతం ఒక అబద్ధం

1 min
277

ఆస్కారం లేని చోట అవకాశాల కోసం ప్రయత్నించి అలిసిపోయానా!!!

అంధకారనికి అలవాటైన మనస్సు వెలుతురుకు ఎందుకు భయపడుతుంది...

 అర్హతకు మించి ఆశపడడం అవివేకమని అంటున్నావా...

అదృష్టం అంటే నచ్చింది దొరకడం అనుకోవడం అతితెలివని అనిపిస్తుంది ఎందుకు...

ప్రేమకి మించి ప్రపంచం లేదనుకోవడం నా అమాయకత్వమా!!

అద్భుతాలన్ని ఆలోచనలేన, కలలో తప్ప కంటికి కనిపించవా...

అబద్ధాలతో జీవితం హాయిగా ఉందని ఆనందపడమంటావా, లేక వెతికినా దొరకని నిజాలు కోసం భయపడమంటావా...

 సమాధానాల కోసం ఎదురుచూస్తూ ఓ బాటసారి...


Rate this content
Log in

Similar telugu poem from Inspirational