STORYMIRROR

MohanKrishna Landa

Drama Others

4  

MohanKrishna Landa

Drama Others

స్నేహ గీతం...

స్నేహ గీతం...

1 min
219

క్యాంపస్ లో మొదలైన పరిచయం, స్నేహంతో మెరుగైందిగా ఆ బంధం.. 

క్లాసు రూములో కలిసిన చేసిన కలకలం, హాస్టల్లో కలసి గొడవలు పడేంత పెరిగిందిగా ఆ బంధం...

ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోతుంది గాభరాగా ఉంది...

ఓ కాలమా కాస్త వెనక్కి వెళ్ళళేవా, మా స్నేహాన్ని విడిచి చాలా దూరం వచ్చేశాము...(2)

ఉద్యోగాల వేటలో విచిత్ర కోతి చేష్టలు చేసిన, మన స్నేహం ఆటపాటలతో సందడి చేయించింది...

కాలం నలుదిక్కులు విసిరేసి వెకిలి చేసిన, వీడుకోలు మనకి కాదని నిరూపించడానికి మన స్నేహమే దారులు చూపుతుంది...

కాని ఎప్పటికైనా మరిచిపోతానేమో అని భయంగా ఉంది...

ఓ కాలమా కాస్త వెనక్కి వెళ్ళళేవా, మా స్నేహాన్ని విడిచి చాలా దూరం వచ్చేశాము...(2)

జీవితమనే జడి వానలో తడుచుకుంటూ చాలా దూరంగా వచ్చేశామనిపిస్తుంది‌.. 

స్నేహాన్ని, ప్రేమని విడిచి కాలచక్రంలో కనుమరుగు అవుతున్నట్లు ఉంది... 

అందరిని‌‌ మరిచిపోతానేమో భయంగా ఉంది...

ఓ కాలమా కాస్త వెనక్కి వెళ్ళళేవా, మా స్నేహాన్ని విడిచి చాలా దూరం వచ్చేశాము...(2)

Rate this content
Log in

Similar telugu poem from Drama