STORYMIRROR

MohanKrishna Landa

Inspirational

4  

MohanKrishna Landa

Inspirational

విద్య వ్యాపారం అయితే

విద్య వ్యాపారం అయితే

1 min
286

అంధకారంలో దాగి ఉన్న అజ్ఞానాన్ని వెలికితేయాలంటే, వెలుగు అనే విత్తనం విలువ తెలిసుండాలి...

అజ్ఞానంతో అజ్ఞాతవాసం గడుపుతున్నప్పుడు, విజ్ఞానంతో కూడిన వికాసానికి చేరుకునేదెప్పుడు...

ఆకలి కేకలు వెనుక ఆవేదన విస్తరిలో ఉన్న ఆఖరి మేతుకుకి తెలుస్తోంది కాని విస్తరిలో పాటు విసిరేసిన విందు భోజనానికి ఎలా తెలుస్తుంది...

వర్షం కోసం ఎదురు చూస్తూ ఎండిపోతున్న పొలాన్ని తన కన్నీళ్ళతో తడుపుతున్న రైతు కంటే బాగా నీటి విలువ ఎవరు అర్థం చేసుకుంటారు...

యుద్ధంలో గెలిస్తేనే తన ఆయువుకి ఒక అర్థం ఉంటుంది అనుకునే పౌరుడికి మాత్రమే ప్రాణం విలువ తెలుస్తుంది...

కట్టెల అవసరం కాటి కాపరి కంటే ఎక్కువ ఎవరికి ఉంటుంది...

కష్టం గురించి వివరించే హక్కు కార్మికుడికి మాత్రమే ఉంది...

కాని ప్రతిఫలం ‌మాత్రం మనలాంటి ఎంతో మంది విజ్ఞాన హీనులది..


రంగు నోట్లు కంటే తెల్ల కాగితాన్ని గౌరవించనంత వరకు విద్య వ్యాపారానకి ప్రతి విద్యార్థి భాధ్యుడే..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational