STORYMIRROR

MohanKrishna Landa

Drama

4  

MohanKrishna Landa

Drama

వర్షంతో ప్రయాణం

వర్షంతో ప్రయాణం

1 min
258

మండుటెండల్లో మగ్గిపోతున్న మానవ శరీరానకి, దప్పికకై ఎదురు చూస్తున్న మండె గుండెలకి ఆసరాగా నిలవడానికి వచ్చే ఓ వర్షఋతువా! చిరకాల మిత్రమా!


ఎండిపోయిన నదికి, దాహం కరువైన పాడెకి, చాలిచాలని పైరు నీరుతో ఎదుగుతున్న పాడిపంటలని పలకరించడానికి, ఆదరించడానికి వచ్చిన నవీన మిత్రమా!


నీ రాకతో కురిసిన వర్షాలకు శాక్షిగా ఆనందంతో చిందులు వెసే ఆ బాలల కేరింతలు, తడిసి ముద్దవుతున్న ఆ పసి హృదయాలే నీ‌ ప్రత్యేకతకు నిదర్శనం...


కన్నీరు, చెమట నీరు తప్ప మరొకటి తెలియని రైతుల ఆకలి తీర్చడానికి వచ్చిన ఓ కరుణామయి వరుణదేవా!


నువ్వు మాతో ఉంటే ప్రేమ చిగురిస్తుంది, ప్రేమికులు పులకరిస్తారు, వీచే గాలుల వల్ల కనువిందు చేసే పచ్చని పొలాల మధ్యలో పక్షుల కిలకిలలు, నాట్యాలు ఇది‌ కదా మనస్సు కోరుకున్న ఆహ్లాదం..


Rate this content
Log in

Similar telugu poem from Drama