STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

"ఆమె...! అతడు...!"

"ఆమె...! అతడు...!"

1 min
369

ఆమె నవ్వే, అతడి వరం..!

ఆమె ఆశే, అతడి ధ్యాస..!

ఆమె శ్వాసే, అతడి ఊపిరి...!

ఆమె గమ్యమే, అతడి లక్ష్యం..!

ఆమె లౌక్యమే, అతడి సౌఖ్యం..!

ఆమె రూపే, అతడి భావం..!

ఆమె చూపే, అతడి దిక్సూచి...!

ఆమె ప్రశ్నే, అతడి జవాబు..!

ఆమె పలుకే, అతడి ప్రేరణ..!

ఆమె ఆనందమే, అతడి ఆలోచన..!

ఆమె కోపమే, అతడి శాపం..!

ఆమె ద్వేషమే, అతడి ప్రేమ..!

ఆమె దూరమే, అతడి భారం..!

ఆమె ఆవేశమే, అతడి ఆవేదన..!

ఆమె ఎడబాటే, అతడి తడబాటు..!

విజాతి ధృవాలు గల ఇద్దరినీ

ఏకతాటి పైకి తెచ్చి కలిపిందో స్నేహ బంధం...!

ఆ బంధం బల పడి ప్రేమగా మారిందో లేదో. ...!

ఎప్పుడూ ఎరుగని ప్రేమనే ఆ మధురానుభూతిని

అతడు అనుభవించెలోపే,

కాలం చేసిన నేరానికో...!

లేక, విధి ఆడిన నాటకానికో...?

ఆ బంధం బలహీనపడి వీగిపోయింది.

ఆమె...!

అతడికి దూరమయ్యింది...!

ఆ బంధం బలహీన పడడానికి కారణం తెలీక,

అతడు మాత్రం ఇంకా ఆమె కోసం నిరీక్షిస్తూ

ఎదురుచూస్తూనే ఉన్నాడు.

ఆమె కలలనే కంటున్నాడు..!

ఆమె ఊహల్లోన్నే విహరిస్తున్నాడు..!

ఆమె జ్ఞాపకాలతోనే జీవిస్తున్నాడు..!

ఆమె గతంలో మాత్రం,

అతడొక మాయని మచ్చగా మిగిలిపోయాడు..!

అతడి నిరీక్షణ ఫలించేనో లేదో ..?

ఫలించి ఆమెకు నిజం తెలిసేనో లేదో..?

తెలిసినా ఆమె తిరిగొచ్చేనో లేదో..?

చివరికి అతడి ప్రేమ గెలిచేనో లేదో..?

- ఓ ప్రేమ పిపాసి..!

- Satya Pavan Writings ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Abstract