STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Crime

4  

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Crime

100 DAYS..

100 DAYS..

1 min
326

ఆకలి..ఆకలి...

అధికారపు ఆకలి

అహంకారపు ఆకలి

అవమానపు ఆకలి


మరో ప్రక్క...

ఆత్మాభిమానపు ఆకలి

పట్టుదలపు ఆకలి

పోరాటపు ఆకలి


ఇద్దరి..రాజుల ఆకళ్లు

ఈ రోజు చేశాయి

లక్షల మంది...ఆకలి కేకలతో

కాళ్లకు బుద్ది చెప్పి..సొంత వూళ్లని వదిలి..

పక్క దేశాలకు పరుగులు తీసే 

వలస పక్షుళ్లు 


వంద రోజుల పండుగ చేసుకోవాలా..

లేక..

ప్రతి రోజు వందరోజులు ఇచ్చేంత

నరకాన్ని ఇచ్చింది అని...

తలచుకొని తలచుకొని..

ఇంకా ఆగని..అరాచకాలకు

తల్లడిల్లాల😭


ఓ..జెలన్స్కీ.. ఓ పుతిన్

వందరోజులు..

ఎంతో...పట్టుదలతో

అలసట లేని శ్రమ తో

అకుంఠిత దీక్షతో

వెనుకడుగు వేయని..పోరాటం తో

ఏ పరీక్షకు సన్నద్ధం అయ్యారు

యే కట్టడాన్ని నిర్మించారు

యే రంగంలో ప్రగతి కి ఇంత కష్ట పడ్డారు

ప్రజలకు ఏ క్రొత్త అవకాశాలు కల్పించారు?


మీకు మీరే దేవుళ్ళు అనుకొని

వేలమంది జవానులు.. జనాల

రక్తాన్ని అర్పన గా తీసుకున్నారా!


ప్రతిరోజూ..

సూర్యుని కిరణాలతో ఎరుపెక్కాల్సిన

అభాగ్యుల ఆవాసములు..

ఎర్రటి రక్తపు మరకలతో..తెరుచుకుంటున్నాయ్

బాంబులు చిమ్మే విష వాయువులు తో..

పట్ట పగలే.. జీవితాలన్నీ చిమ్మచీకట్లవుతున్నయ్


ఎటు చూసినా..

విధ్వంసం..విలయం..

వికృతం..వినాశనం

చేసుకోండి రా...

వంద రోజుల..పండుగ చేసుకోండి

ఎర్ర గులాబీలు తో...నల్లని మల్లెలతో

వేల వేల ఆత్మలు పూలుగా కూర్చిన 

దండలు మెడలో వేసుకొని... ఊరేగండి


        ......రాజ్....



Rate this content
Log in

Similar telugu poem from Tragedy