M.V. SWAMY

Comedy

4.5  

M.V. SWAMY

Comedy

ఉంగరం ఉల్లిపాయ

ఉంగరం ఉల్లిపాయ

2 mins
480


     


       పూర్వం హస్యవల్లరి రాజ్యంలో మందహాసిని అనే యువరాణి ఉండేది,ఆమెకు చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం,ముఖ్యంగా హాస్యాన్ని పండించి కడుపుబ్బా నవ్వించే హాస్యరస చిత్రలేఖనం అంటే ఆమెకు చాలా ఇష్టం.ఆ యువరాణి తలితండ్రులకు,ఆమె బంధుమిత్రులకు కూడా హస్య చతురత ఎక్కువగానే ఉండేది.ఆ రాజ్యంలోని ప్రజలుకు కూడా హాస్య చతురతతో సమయస్ఫూర్తిగా మాట్లాడి ఎదుటివారిని నవ్వించి తాము నవ్వుకునే అలవాటు ఎక్కువగా ఉండేది.


         యువరాణికి యుక్తవయసు వచ్చింది,స్వయం వరం ప్రకటించి ఆమెకు నచ్చిన వరుడుతో వివాహం చెయ్యాలని నిర్ణయించుకున్నారు రాజ గారు.యువరాణి వారికి స్వయవరం ప్రకటించారు. అతిథులుగా వస్తున్న దేశవిదేశాల యువరాజులకు బంధువులకు గుమగుమలాడే వంటకాలతో విందు పెట్టాలని మంత్రిని ఆదేశించాడు రాజు.మంత్రి కొంచెం నసుగుతూ "ప్రభూ మన రాజ్యంలో ఉల్లిపాయల నిల్వలు అసలు లేవు, ఉల్లి పాయలను విదేశాల నుండి తెచ్చుకుంటున్నారు ప్రజలు, విచిత్రమేమిటంటే మన రాజ్యంలో వజ్రాల ధర కన్నా ఉల్లిపాయల ధరలే ఎక్కువగా ఉన్నాయని సామాన్యుల గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటున్నారు, కవులు, రచయితలు, పత్రికల వారు ఉల్లి ధర మండిపోతుండటంతో హాస్య కథనాలుతో ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు అందుకే ఉల్లి నిల్వలు పెరిగే వరకూ యువరాణి స్వయం వరాన్ని వాయిదా వెయ్యండి, ఉల్లిలేని కూరల విందు పసందుగా ఉండదు కదా"అని అన్నాడు. రాజు గారు "ఉల్లిలో ఇంత ఘాటు ఉందా ఉల్లి కొరత సంగతి నాకు తెలిసింది, అయినా మేము అంతగా పట్టించుకోలేదు" అని అనివార్య కారణాల వల్ల యువరాణి స్వయం వరం వాయిదా వేస్తున్నామని ప్రకటించారు, అయితే యువరాణికి ఉల్లి కొరత వల్ల స్వయం వరం వాయిదా పడింది అన్న విషయాన్ని తెలియ కుండా జాగ్రత్త పడి వేరే రాజకీయ కారణాలను ఆమెకు చూపారు, యువరాణి రాజు గారితో "నాన్నగారూ స్వయం వరం వాయిదా మన మంచికే ,అయితే స్వయం వరానికి ముందు నన్ను పెళ్లి చేసుకోబోయే యువరాజు చిత్ర లేఖన ప్రతిభను నేను చూడాలి, కాబట్టి, చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ చూపిన వారే స్వయం వరానికి అర్హులు అని ప్రకటించండి" అంది యువరాణి. రాజు ఆ విధంగానే చిత్రలేఖనం పోటీలు ప్రకటించారు.


               చాలా మంది యువరాజులు చిత్ర విచిత్ర అద్భుత కళా ఖండాలను వేసి యువరాణికి పంపారు . చిత్రాంగదుడు అనే యువరాజు మాత్రం, ఉల్లిపాయను

ఉంగరం పొడిగా అమర్చినట్లు చిత్రాన్ని వేసి యువరాణికి పంపి "మీ దేశంలో ప్రస్తుతం వజ్రాలకి కన్నా ఉల్లిపాయలకే ధర ఎక్కువ పలుకుతుంది, ఈ చిత్రలేఖనంతో పాటు మీ రాజ్య ప్రజలకు వేయ్యి వాహనాలుతో ఉల్లిపాయలు పంపుతున్నాను అని లేఖ రాసాడు. యువరాణికి నవ్వు ఆగలేదు వెంటనే చిత్రాంగదుడుకి లేఖ రాసి గతంలోనే మీ హాస్య చతురత, చిత్ర లేఖ ప్రతిభ, వీరత్వం, మంచితనం గురుంచి విన్నాను, మీకు సమయ స్ఫూర్తి హాస్య చతురత ఉందని ఇప్పుడు తెలుసుకున్నాను, ఈ మధ్యనే నా చెలికత్తెలు మా రాజ్యాంలో ఉల్లి కొరత గురుంచి మాట్లాడుకుంటే విన్నాను, మీరు మా ప్రజలకు ఉల్లిపాయలు పంపినందుకు మీకు ధన్యవాదాలు ,సామాన్యుల సంక్షేమం రాజు లక్ష్యం కావాలి, ఆ నీతి మీలో కనిపించింది, మీకు అభ్యంతరం లేకపోతే ఈ మధ్యనే మన వివాహం జరుతుంది" అని తెలిపింది.చిత్రాంగదుడు అందుకు సమ్మతించాడు.


          చిత్రాంగదుడు, మందహసిని వివాహం అంగరంగ వైభోగంగా జరిగింది. ఉల్లిపాయలను పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు హితవు పలికి,ఉల్లి వ్యవసాయ పద్ధతులు, ఎక్కువ దిగుబడికి చిట్కాలు తన రాజ్య రైతులతో చెప్పించి, హస్యవల్లరి దేశంలోని అన్ని కుటుంబాలకూ కొన్ని రోజులకు సరిపడా ఉల్లిపాయలను కానుకలుగా పంచాడు చిత్రాంగదుడు, రాజ్యంలోని ప్రజలు ఉల్లిపాయలు వచ్చాయని ఆనందం, హాస్య చతురత కలిగిన యువరాజు తమ యువరాణికి లభించాడన్న సంతోషంతో పిచ్చాపాటీ మాట్లాడు కుంటూ హాయిగా నవ్వుకున్నారు.



         ..... పృథ్వి



Rate this content
Log in

Similar telugu story from Comedy