M.V. SWAMY

Comedy

4  

M.V. SWAMY

Comedy

నాయుడు.... వినాయకుడు

నాయుడు.... వినాయకుడు

3 mins
502


    నాయకుడు.... వినాయకుడు (కథ)


ఒక రోజు ఒక రాజకీయ నాయకుడు ఢిల్లీ నుండి గల్లీకి విమానంలో బయలెళ్లాడు.విమానం కిటికీ గుండా ఆకాశం సౌందర్యం, మేఘాల అందాలు చూసి మురిసిపోయాడు,

ఇంతలో విమానం పక్కనుండి వినాయకుడు ఎలుక వాహనం మీద కూర్చొని భూలోకం వస్తున్నాడు. "హలో వినాయకా! బాగున్నావా! మీ ఫ్యామిలీ ఎలావుంది. అమ్మా నాన్న తమ్ముడు, నంది, బృంగి అందరూ క్షేమమే కదా"అని పలకరించాడు నాయకుడు. నాయకుడి పలకరింపుకి బదులుగా "ఏమి నాయనా బాగున్నావా... ఎలాగున్నారు నిన్ను గెలిపించిన ప్రజలు!"అని అడిగాడు వినాయకుడు. "ఆ ప్రజాఓలదేముందండి బాగానే వుంటారు, నన్ను గెలిపించారు కదా నా పేరు చెప్పుకుంటే చాలు వాళ్లకు ఏ లోటూ లేకుండానే అధికారులు చూసుకుంటారు, నేనంటే అందరికీ హడల్ అధికారులు గానీ ప్రజాలుగానీ నా పాలనలో ఏ లోటుపాట్లు వున్నా నోరు మెదపడానికి వీల్లేదు అదీ నా పవర్"అని అన్నాడు నాయకుడు. "నాయనా నిన్ను నమ్మి నీకు అధికారం ఇచ్చిన ప్రజలను మంచిగా చూసుకో...!"అని అన్నాడు వినాయకుడు.నాయకుడు నవ్వుతూ "ముందు నీ ఎలుక జాగ్రత నిన్ను నమ్ముకొని బ్రతుకుతుంది,దొరికిన అడ్డమైన తిండీ నువ్వే తినేయకుండా కొంచెం ఎలుకకు మిగుచ్చు"అని వెకిలిగా నవ్వాడు నాయకుడు. "నాతో వెటకారమాడితే జాగ్రత్త,గతంలో నన్ను చూసి నవ్విన చంద్రుడుకి మా అమ్మ ఇచ్చిన శాపం గుర్తుకు తెచ్చుకో"అని కొంచెం కోపంగా అన్నాడు వినాయకుడు."పురాణనీతులు చెప్పకు వినాయకా... ఆరోజులు పోయాయి, ముందు నీకు ఒంటినిండా బట్టలు కుట్టించమను మీ అమ్మా నాన్నని, అయినా మీ నాన్న దగ్గర డబ్బులు వుండవటగదా" అని అంటూ విమానం ఆదిరిపోయేటట్లు నవ్వాడు నాయకుడు.వెంటనే విమానం కిటికీ నుండి నాయకుడిని బయటకు లాగేసి ఉతికి పారేయాలనుకున్నాడు వినాయకుడు, ఇంతలో నారదుడు కనిపించి, "సోదరా వినాయకా... శాంతించు, నాయకుడుకి అధికార మదం నెత్తికెక్కింది, దానికి

 త్వరలో ముగింపు ఉంది, వీడి మదహంకారాన్ని దించి వీడికి అందలం ఎక్కించిన ప్రజలే వీడికి ఎలా బుద్ది చెబుతారో నువ్వే చూద్దువుగాని,మనం తొందరపడి శపించినా, చంపేసినా ప్రజలు సానుభూతి పొంది, వీడి తరువాత వీడి కొడుకులు అధికారంలోకి వస్తారు, అలా వీళ్ల ఆగడాలు కొనసాగుతునే ఉంటాయి" అని వినాయకుడిని వారించి అక్కడ నుండి తీసుకొని వెళ్లిపోయాడు నారదుడు."ఏనుగు తొండం వినాయకుడికి తోడు, ఈ తగువులూ తంటాలు తగిలించేసే నారదుడు ఒకడు, శాపాలూ పాపాలూ అంటూ తిరుగుతాడు" అని వికటట్టహాసం చేసాడు నాయకుడు. విమానంలో నాయకుడు పక్కనున్న మనిషి నాయకుడిని నిద్రనుండి లేపి "ఆర్ యూ ఓకే..."అని అడిగాడు. అప్పుడర్ధమయ్యింది నాయుడుకి తాను కలగన్నానని, విమానం ప్రయాణం మొదలయిన కొద్దీసేపటికే తాను మగత నిద్రలోకి పోయానని, అప్పుడు కలలో వినాయకుడు, నారదుడు కనిపించారని, వారి మధ్య తమాషా వాదోపవాదాలు జరిగాయని, ఆ కలని విమానంలోని ప్రయాణికులకు చెప్పి విరగబడి నవ్వాడు నాయకుడు. బుర్రా బుద్ధి ,మంచి మర్యాద తెలియనివాడిని నాయకుడుగా ఎన్నుకుంటే ఇలాగే ఉంటుంది... వీడికి మేనర్స్ లేవు అయినా వీడిని ఏమీ అనలేము, గల్లీ నుండి ఢిల్లీ వరకూ మస్తు పలుకుబడి, పవర్ ఉన్న నాయకుడు"అని మనసుల్లోనే అనుకొని ఊరుకున్నారు విమాన ప్రయాణికులు.కొన్నాళ్లు గడిచాయి, వీలు దొరికినప్పుడల్లా విమానంలో తనకు వచ్చిన కల గురుంచి అందరికీ చెబుతూ కలలో తనతో వాదించలేక వినాయకుడు నారదుడు పారిపోయారని డాంబికాలు పలుకుతూ విర్రవీగుతుండేవాడు నాయకుడు.

 ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల్లో నాయకుడు తాను గెలిస్తే ప్రజలకు ఏమి మేలు చేస్తానో చెప్పకుండా, తనకు దొరికిన ప్రతి వేదిక మీదా విమానంలో తనకు వచ్చిన కలగురుంచే చెబుతూ... కలలో వినాయకుడు, నారదుడు తన ముందు ఓడిపోయి పలాయనం చిత్తగించారని చెబుతూ తెగ విర్రవీగుతుండేవాడు. అసలే నాయకుడి దుష్ట పాలనతో విసిగిపోయిన ప్రజలు మతాలు కులాలు నాస్తికులు, ఆస్తికులు, ప్రాంతాలతో సంబందం లేకుండా ఒక్కటయ్యారు," వీడికి వచ్చిన కల నిజమో కల్పితమో మనకెందుకు, వీడి మాటలు తీరు అసందర్భ ప్రేలాపన వీడి పొగరు, అధికార మదాన్ని తెల్పుతున్నాయి, వీడి వల్ల సమాజానికి దమ్మిడీ మేలు కూడా జరగదు, వీడినే కాదు వీడి వారసులనూ ఎప్పుడూ గెలిపించకూడదు"అని నిర్ణయించుకొని ఎన్నికల్లో నాయకుడిని చిత్తుగా ఓడించారు. అప్పుడు ఒక ప్రముఖ పత్రిక విలేకరు వచ్చి "నాయకా నారదుడు వినాయకుడికి నీ ఓటమిని, పతనాన్ని చూపించి నీకు అందళమెక్కించిన వారే అదః పాతాళానికి తొక్కేశారు అని చెబుతున్నట్లు నాకు కల వచ్చింది, దీనిపై మీ కామెంట్ ప్లీజ్ "అని నాయకుడిని అడిగాడు. నాయకుడు లెంపలేసుకొని నన్ను వదిలేయండి బాబూ అన్నట్లు దండం పెట్టి ఎదురుగా ఉన్న వినాయకుడి గుడికి ఎదురుగా నిలబడి గుంజీలు తీసాడు, ప్రజలు నాయకుడు ఊసరవెల్లి తీరుచూసి నవ్వుకున్నారు.



Rate this content
Log in

Similar telugu story from Comedy