STORYMIRROR

Dinakar Reddy

Horror Thriller

3  

Dinakar Reddy

Horror Thriller

మూర్తాభిషిక్తుడు భీశ్టీనాయక్

మూర్తాభిషిక్తుడు భీశ్టీనాయక్

1 min
225

కుంభీనశా కరకింకరా. నీ ఉపాసనలు చేసి నిన్ను మెప్పించిన మూర్తాభిషిక్తుడు భీశ్టీ నాయక్ ఇప్పుడు ఇలా బూడిద అయ్యాడు. 


నీ భక్తులంతా ఆత్మహత్య చేసుకున్నారు. నీ సేవల కోసం పొరుగు దేశం వెళ్ళిన నేను తిరిగి వచ్చేసరికి ఇలా జరిగిపోయింది.


రసాతల నాయకా. ఇదిగో మూర్తాభిషిక్తుని బూడిద. దీనిని నేను నా శరీరంలో భద్రపరుస్తాను. నా ఆత్మను నీకు దాసోహం చేస్తాను. మూర్తాభిషిక్తుని శక్తుల్ని నాకు ప్రసాదించు అంటూ కాత్యాయని కరకింకర విగ్రహం ముందు కూర్చుని బూడిదను నీటిలో కలిపి తాగింది.


ఆమె కరకింకర కళ్ళలోకి చూస్తూ నిలుచుంది. ఆమె ఒంటిలోనికి ఎన్నో భయంకర శక్తులు ప్రవేశించాయి.


అనిరుధ్ దక్షిణ హస్తాన్ని నైవేద్యంగా పెట్టాలి. మూర్తాభిషిక్తుడు పవన్ రూపంలో సజీవుడవుతాడు అనే ఆదేశం ఆమె అందుకుంది.


కాత్యాయని కొడవలి చేతిలోకి తీసుకుని 

వికటాట్టహాసం చేసింది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Horror