మౌన రాగం
మౌన రాగం


ఒక్కసారి నాతో మాట్లాడు జాహ్నవి.
అతడు బతిమిలాడుతున్నాడు.ఆమె ముభావంగా ఉంది.
చెప్పు.నేనేమైనా తప్పు చేశానా. చెప్పు జాహ్నవి.
నేనేదైనా తప్పు చేసుంటే నాకేదైనా శిక్ష విధించు.
ప్లీజ్ జానూ! ఇలా మాట్లాడకుండా నన్ను బాధ పెట్టకు.
అతని మాటలు విన్న ఆమె లేచి నిలబడింది.
పార్కు నిర్మానుష్యంగా ఉంది.
అతడి వాట్సప్ కి ఒక వాయిస్ మెసేజ్ ఆమె పంపించింది.
"ఏంటోరా బాబు.ఈ జాహ్నవి ఏది చేసినా రివర్స్ అవుతుంది.నా UPSC పరీక్ష ప్రిపరేషన్ టైంలో నా పక్కనే ఉండేది. తనే నా బ్యాడ్ లక్ అనిపిస్తోంది.చాలా కష్టపడి చదివాను."
ఆ మెసేజ్ అతను చాలా ఫ్రస్ట్రేషన్ లో పంపాడు స్నేహితునికి.
అతడు మొత్తం మెసేజ్ వినేసరికి ఆమె వడివడిగా అడుగులు వేసుకుంటూ బయటకు నడిచింది.
ఆమె బాధ ఒక మౌన రాగంలా అతడి హృదయాన్ని తాకింది.