STORYMIRROR

BETHI SANTHOSH

Fantasy

4  

BETHI SANTHOSH

Fantasy

గెలుపు - ఓటమి

గెలుపు - ఓటమి

1 min
526

సుఖ పడాలి అనుకుంటే 

కష్ట పడక తప్పదు;


ముళ్ళ బాట లేనిది

పూల బాట రాదు రాలేదు;


మనం ఎదగడం  

అందరికీ నచ్చకపోవడం సహజం ఈ రోజుల్లో కానీ:


ఒదుగుతూ ఎదగలి

ఎడుగుతూ ఒదగాలి


ఎంత తొక్కిన మనల్ని 

పైకి బంతిలా ఎగరడం కంటే

నత్త లా సాగిన పర్వాలేదు,

ప్రయాణం..


విజయం సాధించిన రోజు

వెనక పడిన నక్కలు

వెంట పడిన కుక్కలు


అన్ని సాలం కొడుతూ

సాహో అంటూ


నీ విజయం నీ వాళ్ల విజయం గా భావించి..


పొగడ్తలకు పోయే జనం మధ్యలో ఉన్న మనం.


జాగ్రత మిత్రమా


నేస్తమా 

ఆలస్యం అయింది అని అలిసి పోకు

తొందర గా వచ్చింది విర్ర వీగకు.


విజయం అనేది నలుగురు చెప్పుకునే లా ఉండాలి.

పది మంది తిట్టుకునే లా కాదు..


చస్తే వీడు పోయాడు హమ్మయ అనేలా కాకుండా


చస్తే నీ పాడే మోయడానికి పోటి పడేలా గెలవాలి.


నీ గెలుపుకు చప్పట్లు రాలేదు అని బాధ వలదు.

నీ ఓటమి పది మంది కి స్ఫూర్తి ఇస్తుందా లేదా అనేదే ముఖ్యం..


విజయమో

వీర మరణమో


తల వంచుకున్న పర్లేదు


తలంపు రాకుండా ఉండేలా గెలవాలి..



ఇట్లు

ఓ సహోదరుడు


Rate this content
Log in

Similar telugu story from Fantasy